అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు

Oct 31 2025 8:02 AM | Updated on Oct 31 2025 8:02 AM

అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు

అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు

నెహ్రూసెంటర్‌: ఆర్టీసీ, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు ఉద్యమాల్లో ముందుండి కార్మికుల పక్షాన పోరాడిన వామపక్ష నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు సాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. పోరాట కేసుల్లో భాగంగా కోర్టుకు హాజరై వామపక్ష నాయకులు గురువారం అంబేడ్కర్‌ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తమపై అక్రమంగా కేసులు పెట్టినా ప్రజలు, కార్మికుల పక్షాన పోరాటాలు సాగిస్తామని తెలిపారు. స్వల్ప మెజారిటీతో నెగ్గిన బీజేపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం తప్పదని, రైతులు, కార్మికులే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి వామపక్ష నాయకులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో అజయ్‌సారథిరెడ్డి, తమ్మెర విశ్వేశ్వర్‌రావు, నల్లు సుధాకర్‌రెడ్డి, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, హెచ్‌లింగ్యా, చొప్పరి శేఖర్‌, పెరుగు కుమార్‌, చింతకుంట్ల వెంకన్న, వరిపెల్లి వెంకన్న, రాజమౌళి, అల్వాల వీరయ్య, నాగయ్య, ఉపేందర్‌, మఽధు, సాయిలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement