పత్తి కొనుగోళ్లకు సిద్ధం చేయాలి
మహబూబాబాద్: కనీస మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు అన్ని సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించా రు. సాక్షి దినపత్రికలో ‘కొనుగోళ్లు ఆలస్యం..’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈమేరకు కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పత్తి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో 84,718 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని, 6,14,000 క్వింటాళ్ల పత్తి దిగుమతి అవుతుందని అధికారులు అంచనా వేశారన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి పంట కొనుగోలుకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110 ప్రకటించిందని, పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. సమావేశంలో డీఏఓ విజయనిర్మల, అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
పత్తి కొనుగోళ్లకు సిద్ధం చేయాలి


