వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
హసన్‌పర్తి: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ. వరదారెడ్డి అన్నారు. బీఎస్సీ(అగ్రికల్చర్)లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సర విద్యార్థులకు గురువారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. వ్యవసాయ విద్యనభ్యసించిన విద్యార్థులు దేశాభివృద్ధికి వెన్నెముకలని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రయాణంలో ప్రావీణ్యం,నైతికత, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు ప్రయోగిక జ్ఞానంపై దృష్టి సారించాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి, ప్రస్థానం, విద్యా విజయాలు, అంతర్జాతీయ ర్యాంకుల గురించి వివరించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ భూపాల్‌రాజ్, డాక్టర్ మోహనకీర్తి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్
ఎ. వరదారెడ్డి


