ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్‌ను వినియోగించుకోవాలి
● మ్యూచువల్ ఫండ్ ఎండీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే ఝా
వరంగల్ చౌరస్తా : ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ వినియోగ థీమ్‌ను అనుసరించి ఈనెల 31న ఓపెన్–ఎండ్ స్కీమ్‌ను ఎల్‌ఐసీ కంజప్షన్ ఫండ్‌ను ప్రారంభిస్తోందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్.కే ఝా తెలిపారు. గురువారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నూతన స్కీం అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 14న ముగుస్తుందన్నారు. ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతం 15 ఈక్విటీ, 9 డెట్, 6 హైబ్రిడ్, 1 సొల్యూషన్ ఓరిఝెంటెడ్, 41 విభిన్న పథకాలు అందిస్తుందన్నారు. ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతినిధులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.


