కోటలో సదర్ సంబురం..
ఖిలా వరంగల్: చారిత్రక మధ్యకోట ఖుష్‌మహాల్ ప్రాంగణం సదర్‌తో సందడిగా మారింది. సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో హైదరాబాద్‌కు చెందిన మధుయాదవ్ హరియాణా నుంచి తీసుకొచ్చిన దున్న పోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అంతకు ముందు దున్న పోతులను రాజసం ఉట్టిపడేలా అలంకరించి డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఖుష్‌మహాల్ ప్రాంగణానికి తీసుకొచ్చారు. దున్నపోతులకు ఎదిరేగిన యాదవ మహిళలు మంగళహారతులు పట్టి ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు చేసి యాదవ వీధి నుంచి శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా సభవేదికగాకు తీసుకొచ్చి ప్రతిష్ఠించి వేడుకలు కొనసాగించారు. ‘కుడా’ మాజీ చైర్మన్ సుందర్ రాజ్‌యాదవ్ సదర్ ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. దున్నల పూజించే గొప్ప సంస్కృతి యాదవులకే దక్కిందన్నారు. కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దేనబోయిన రవియాదవ్, గౌరవ అధ్యక్షుడు బైరబోయిన దామోదర్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి కై లాష్ యాదవ్, యాదవ మహాసభ జిల్లా చైర్మన్ దొంగల చెన్న మల్లు యాదవ్, పృథ్వీ రాజు, మూగల కుమార్, కార్పొరేటర్ ఉమ, నాయకులు బొల్లబోయిన కిశోర్, బనక సిద్దిరాజ్ యాదవ్, సదర్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
రాజసం ఉట్టిపడేలా హరియాణా
దున్నపోతుల అలంకరణ
మధ్యకోట పురవీధుల్లో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహం ఊరేగింపు
కోటలో సదర్ సంబురం..


