వరంగల్‌లో అద్భుత శిల్ప కళాసంపద
హన్మకొండ: వరంగల్ అద్భుత శిల్ప కళా సంపదకు నిలయమని ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్లు అరవింద్ కుమార్, విశ్వజిత్ ఖన్నా అన్నారు. కాకతీయుల శిల్ప కళా సంపదను వీక్షించడానికి ఈఆర్‌సీ చైర్మన్ల దంపతులు వరంగల్ చేరుకున్నారు. వీరికి హనుమకొండ న క్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అరవింద్ కుమార్, విశ్వజిత్ ఖన్నా దంపతులు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. రుద్రేశ్వర స్వామివారికి పూజారులు మహా రుద్రాభిషేకం జరిపించి ఆశీర్వచనం అందించారు. కాకతీయుల శిల్ప కళాసంపదను చూసి అబ్బురపడ్డారు. అనంతరం ఇరువురు చైర్మన్లు మా ట్లాడుతూ కాకతీయుల వంశానికి చెందిన వేయి స్తంభాల దేవాలయాన్ని దర్శించుకోవడం సంతో షంగా ఉందన్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి ప్రధాన అర్చకుడు శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచనం అందించారు. అనంతరం ఖిలావరంగల్ కోటలోని కాకతీ య కీర్తితోరణాలు, ఏకశిల గుట్ట, గుండుచెరువు, ఖుష్ మహల్ ను సందర్శించారు. పర్యాటక శాఖ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్య కిరణ్.. ఖిలా వరంగల్ చరి త్రను వివరించారు. కార్యక్రమంలో టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, హనుమకొండ ఎస్‌ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్‌ఈ కె.గౌతమ్ రెడ్డి, డీ.ఈలు జి.సాంబరెడ్డి, మల్లికార్జున్, భాస్కర్, ఎ.డి.ఈ మల్లికార్జున్ పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈఆర్‌సీ చైర్మన్లు


