గొల్లపల్లి ఇకలేరు..
నర్మెట : కాంగ్రెస్ సీని యర్ నాయకుడు, కొమురవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి కు మార స్వామి (72) గుండెపోటుతో మృతి చెందా రు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం డయాలసిస్‌కు వెళ్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో కారులోనే తుదిశ్వాస విడిచారు. కాగా, కమ్యూనిస్టు భావజాలంతో 1971లో రాజకీయాల్లోకి వచ్చిన కుమారస్వామి 1978లో ఉపసర్పంచ్‌గా, మూడు పర్యాయాలు సర్పంచ్‌గా (1995, 2001, 2009) నర్మెట పీఏసీఎస్ డైరెక్టర్‌గా (2004), కొమురవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్‌గా (2011–13) పార్టీకి, ప్రజలకు సుదీర్ఘకాలం సేవలందించారు. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మి, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఫరీదుల యాదయ్య, బీఆర్‌ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు ఇమ్మడి శ్రీనివాస్, తేజావత్ గోవర్ధన్, రామిని శివరాజ్‌గుప్తా, పలుపార్టీల నాయకులు.. గొల్లపల్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జంగా రాఘవరెడ్డి.. గొల్లపల్లి పాడె మోసి కన్నీరు పెట్టుకున్నారు.
నిర్మాణ్ ఆర్గనైజేషన్‌తో
ఆర్ట్స్‌కాలేజీ ఎంఓయూ
కేయూ క్యాంపస్ : ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్మాణ్ ఆర్గనైజేషన్‌తో హనుమకొండలోని ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కాలేజీ ఎంఓయూ కుదుర్చుకుందని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి తెలిపారు. ఈఎంఓయూతో ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీ విద్యార్థులకు ఇన్ఫోసిస్, మైక్రోసాప్ట్‌తోపాటు పలు కంపెనీలతో శిక్షణపొందే అవకాశం ఉంటుందన్నారు.కార్యక్రమంలో నిర్మాణ్ ఆర్గనైజేషన్ మేనేజర్ నరేశ్, కళాశాల ప్లేస్‌మెంట్ సెల్ ఆఫీసర్ ఎల్.జితేందర్, అధ్యాపకులు అజ్మీరా రాజేశ్, డాక్టర్ భిక్షపతి, తదతదిరులు పాల్గొన్నారు.
● గుండెపోటుతో కొమురవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ కుమారస్వామి మృతి
● నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు కొమ్మూరి, జంగా
గొల్లపల్లి ఇకలేరు..


