మహిళలు స్వశక్తితో ఎదగాలి..
న్యూశాయంపేట: ఆధునిక టెక్నాలజీ యుగంలో మహిళలు సరికొత్త ఆలోచనలతో స్వశక్తితో ఎదిగి కుటుంబానికి అండగా నిలవాలని మాజీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ అన్నారు. మైనారిటీ ఇంటలెక్చువల్ ఫోరం వరంగల్ ఆధ్వర్యంలో ఫోరం అధ్యక్షుడు అనీస్ సిద్ధిఖీ అధ్యక్షతన గురువారం హనుమకొండ ములుగురోడ్డు మైనారిటీ కమ్యూనిటీ హాల్‌లో ఇటీవల కరాటే పోటీల్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థిని మహ్మద్ ఆసియా సన్మానంతో పాటు ఎంఐఎఫ్ ఆధ్వర్యంలో మహిళలకు 8వ బ్యాచ్‌లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు అభివృద్ధి సాధిస్తే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందన్నారు. మైనారిటీ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనురాగ్ హెల్ఫింగ్ సొసైటీ అధ్యక్షురాలు అనితారెడ్డి, హనుమకొండ(జి1) ప్రిన్సిపాల్ నీరజ, అడ్వకేట్ డాక్టర్ వలీఉల్లా ఖాద్రీ, ఫోరం సభ్యులు సయ్యద్ అక్బర్, మాషూఖ్ రబ్బానీ, ఎం.ఎ. నయీం, ఆలంఖాన్, అజ్మద్ అలీ, ఖుస్రూ ఆలం, ఎంఐఎఫ్ మహిళా వింగ్ సభ్యులు నుస్రత్, నాజ్‌నీన్, తస్లిం, నజ్మా, జేబా తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్


