రక్షణ.. రాళ్ల పాలు!
చోటు చేసుకున్న
ఘటనలు ఇవే..
గ్రానైట్ బండల తరలింపులో నిర్లక్ష్యం
తొర్రూరు: టన్నుల కొద్దీ బరువు.. త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్లు బండ రాళ్లు.. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోని ఆ వాహనాలు దారి మధ్యలో దూసుకెళ్తుంటే.. వాటి ముందు, వెనుక ఉన్న ప్ర యాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. లారీల నుంచి రాళ్లు తమ మీద పడతాయేమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో గ్రానైట్ రాళ్లను రవాణా చేస్తున్న లారీలు నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కళ్లముందే అజాగ్రత్తగా, ప్రమాదకరంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రవాణా, పోలీసు, మైనింగ్ శాఖలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి.
జిల్లాలో ఇలా...
జిల్లాలో 167 బ్లాక్, కలర్ గ్రానైట్ క్వారీలున్నాయి. ఇందులో 53 క్వారీల్లో గ్రానైట్ తీస్తున్నారు. నెల్లికుదురు, తొర్రూరు, కేసముద్రం, ఇనుగుర్తి, గూడూరు మండలాల్లో ఉన్నాయి. వీటి నుంచి అధికంగా ఖమ్మంలోని గ్రానైట్ పరిశ్రమలకు తరలిస్తున్నారు. ఆర్డర్ల ఆధారంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. లారీ సామర్థ్యాన్ని బట్టి 45 నుంచి 55 టన్నులు, ట్రాక్టర్‌లో 5 టన్నుల రాయిని తరలించేందుకు గనులు, భూగర్భ శాఖ అధికారులు అనుమతి ఇస్తున్నారు.
ఇష్టారాజ్యంగా తరలింపు...
అధిక లోడుతో పాటు ఒక నిర్ధిష్టమైన ఆకారంలో గ్రానైట్‌ను తరలించడం లేదు. క్వారీల నుంచి పరిశ్రమలకు తరలించే సమయంలో రాళ్ల ఎత్తుపల్లాలు సరిగా ఉండేలా కటింగ్ చేసి పంపించాలి. నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఎవరూ పట్టించుకోరని రాత్రి వేళల్లో రవాణా చేస్తున్నారు. సామర్థ్యాన్ని మించి రవాణా చేయడం వల్ల ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, నర్సింహులపేట, కేసముద్రం, గూడూ రు ప్రాంతాల్లో ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయి. రహదారులు దెబ్బతింటున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులున్నాయి.
● ప్రస్తుతం పరిమితికి మించి 7–8 మెట్రిక్ టన్నుల రాళ్లను రవాణా చేస్తున్నారు.
● అనుభవం లేని డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు.
● పగలు రాత్రి తేడా లేకుండా, జనసంచారం, ప్రధాన కూడళ్లు, రద్దీగా ఉండే రహదారుల్లో భారీ వాహనాలు దూసుకెళ్తున్నాయి.
● చాలా వాహనాలు కండీషన్‌లో ఉండడం లేదు. అధికారుల పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా రవాణా చేస్తున్నారు.
2023 ఏప్రిల్‌లో తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామ శివారులో గ్రానైట్ లారీ ఢీకొని ఖమ్మంకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
2022 డిసెంబర్ 30న కురవి మండలం అయ్యంగారిపల్లిలో గ్రానైట్ లారీ నుంచి బండ జారి ఆటోపై పడి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.
ఈ నెల 17న తొర్రూరు మండలం మాటేడు గ్రామ శివారు జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ ఢీకొని 12 గొర్రెలు మృతి చెందాయి.
ఈ నెల 21న తొర్రూరు బస్టాండ్ సమీపంలో గ్రానైట్ లారీ డివైడర్‌ను ఢీకొట్టగా డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్ల వారు జామున జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
నిబంధనలు పాటించని నిర్వాహకులు
ప్రమాదాలు జరుగుతున్నా
పట్టింపులేని అధికారులు
రక్షణ.. రాళ్ల పాలు!


