కార్తీకమాసం పూజలు ప్రారంభం
● నెలరోజుల పాటు ఆకాశ దీపాలు, దీపం పూజలు
మహబూబాబాద్ రూరల్:శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన ‘కార్తీక మాసం’ పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి. దేవాలయాల అర్చకుల ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ఆకాశదీప పూజలు ప్రారంభించారు. దేవాలయాల్లో నెలరోజుల పాటు పూజలు జరగనున్నాయి. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం శివాలయాల్లో కార్తీక మాస అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, సాయంత్రం 6 గంటలకు ‘ఆకాశదీపం’ పూజలతో అర్చకులు భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.
వీరభద్రుడి సన్నధిలో..
కురవి:మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారికి బుధవారం కార్తీక మాసోత్సవ పూజలను అర్చకులు, వేదపండితులు ప్రారంభించారు. ఈ పూజలు నవంబర్ 20వ తేదీ వరకు నెలరోజులపాటు కొనసాగుతాయని ఆలయ ఈఓ సత్యనారాయణ, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్‌రెడ్డి తెలిపారు. కార్తీక మాసంలో నెలరోజులపాటు గోత్రనామార్చన చేయించుకోదలచిన భక్తులు రూ.1,116 చెల్లించి పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈనెల 25న నాగులచవితి, శ్రీ సుబ్రహ్మణ్యాస్వామి వారికి ప్రత్యేక అభిషేకం ఉందని వివరించారు. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి దీపోత్సవం, సాయంత్రం జ్వాలాతోరణం ఉంటుందన్నారు. నవంబర్ 18న లక్ష బిల్వార్చన, రుద్ర, ఛండీ హోమాలు ఉంటాయని తెలిపారు.
బయ్యారం: ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వ్యవసాయశాఖ ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు సూచించారు. బయ్యారంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ధాన్యం సేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యంలో తేమ 17శాతం కంటే పెరగకుండా, ప్రభుత్వం సూచించిన నాణ్యతా ప్రమాణాలతో పాటు టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా సెంటర్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సన్మానం..
మండలంలో యూరియా పంపిణీలో భాగస్వాములైన పలు శాఖల అధికారులను మండల ప్రత్యేకాధికారి, ఏడీఏ శ్రీనివాసరావు సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఏఓ రాజు, గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సైలు తిరుపతి, మహబూబీ, ఐకేపీ ఏపీఎం తిరుమలసింగ్ తదితరులు పాల్గొన్నారు.
మామునూరు: అమరవీరుల త్యాగాలు మరువలేనివని కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే సామాజిక విలువలు, హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటా లియన్ ఆవరణలో పరిపాలన విభాగం అధి కారుల ఆధ్వర్యంలో ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి హాజరై ఓపెన్‌హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పారు. అనంతరం పలు రకాల ఆయుధాలను ప్రదర్శించారు. విద్యార్థులకు అధునాతన ఆయుధాలు, వాటి పనితీరు, చట్టాలు, కేసులు, రికార్డులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు నవంబర్ 14వరకు నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ పర్యవేక్షించారు. డాక్టర్ మంద శ్రీనివాస్, శ్రీదేవి అధ్యాపకులు ఉన్నారు.
కార్తీకమాసం పూజలు ప్రారంభం


