మార్కెట్.. మక్కలమయం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం అధికంగా మక్కలు వచ్చాయి. కాగా 12,112 బస్తాల (7,267 క్వింటాళ్ల) మక్కల క్రయవిక్రయాలు జరిగాయి. గరిష్ట ధర క్వింటాకు రూ.2,031, కనిష్ట ధర రూ.2,016 పలికిందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు.
నేడు కొనుగోళ్లు బంద్..
వ్యవసాయ మార్కెట్ షెడ్లు మక్కలతో నిండి ఉన్నాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ అన్నారు. మక్కలు అధికంగా రావడం, అదే విధంగా వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు గురువారం మక్కల కొనుగోళ్లు బంద్ చేస్తున్నామన్నారు. ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
25న దడువాయి, హమాలీ,
కూలీల సమావేశం..
వ్యవసాయ మార్కెట్‌లో పనిచేస్తున్న దడువాయిలు, హమాలీలు, చాటావాలాలు, ఇతర కూలీల సమావేశం ఈనెల 25న నిర్వహిస్తున్నామని మార్కెట్ చైర్మన్ సుధాకర్ తెలిపారు. ఈ సమావేశానికి కార్మిక సంఘాల, రైతు సంఘాల నాయకులు, హమాలీలు, చాటవాలాలు, కూలీలు, ముఠా సభ్యులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.
28 నుంచి పత్తి కొనుగోళ్లు..
వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈనెల 28వ తేదీ నుంచి కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభం అవుతాయని మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. రైతులు తమ పత్తిని తేమ, చెత్తా చెదారం లేకుండా శుభ్రపరిచి, గుడ్డి పత్తి, మంచిపత్తి వేర్వేరుగా బస్తాల్లో తీసుకుని వచ్చి మంచి ధరను పొందాలని ఆయన కోరారు.
7,267 క్వింటాళ్ల్ల విక్రయం
నేడు మక్కల కొనుగోళ్లు బంద్


