విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలు పెంచేవిధంగా ఉపాధ్యాయులు బోధించాలని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని హనుమంతునిగడ్డ, గుమ్ముడూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరుకావాలని, క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. నాణ్యమైన భోజనం, ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీసి పోటీ పరీక్షల్లో పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు రాంజీనాయక్, బాలాజీ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో..
అనంతరం మోడల్ స్కూల్‌లో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో డీఈఓ దక్షిణామూర్తి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను నిర్మూలించడంలో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ విజయ కుమారి, ప్రాజెక్ట్ మేనేజర్ చంద్రయ్య, రిసోర్స్ పర్సన్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ దక్షిణామూర్తి


