పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
మహబూబాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నెలలు గడుస్తున్నా నేటికీ బకాయిలుు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రిటైర్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్, నిరంజన్‌రెడ్డి, మోహనాచారి, వెంకటేశ్వర్లు, వెంకన్న, ఇమామ్, రమేశ్‌బాబు, దర్గయ్య, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.


