ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో వివిధ విభాగాల పరిశోధకులకు బుధవారం ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 187 మంది పరిశోధకులకు గాను 180 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల నిర్వహణను కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం పరిశీలించారు. ప్రొఫెసర్ కె.రాజేందర్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.మనోహర్, ఎస్.నర్సింహచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్, మమత తదితరులు పాల్గొన్నారు.


