
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్
జనగామ రూరల్: వీర తెలంగాణ రైతాంగ సాయుఽ ద పోరాటంలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివవి, చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ను నిలదీయాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన తెలంగాణ సా యుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం పట్టణంలో రైల్వే స్టేషన్ నుంచి ప్రె స్టెన్ మైదానం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంఏ బేబీ మాట్లాడుతూ తెలంగాణలో 1946 – 51 వరకు నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మూడు వేల గ్రామాలు పాల్గొన్నాయన్నారు. ఈ సందర్భంగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది కార్యకర్తలు చనిపోయారని, ఈపోరాట ఫలితంగా తెలంగాణలో భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. 1957లో కేరళలో భూసంస్కరణ చట్టం కోసం ఉద్యమం ముందుకు వచ్చిందన్నారు. చరిత్రలో పారిస్ కమ్యూన్ కంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గొప్పదన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణలో విమోచన పేరుతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గాడ్సే 6నెలలకు ముందే సావర్కర్ వద్ద ఆశీర్వాదం పొంది గాంధీజీని హత్య చేశారని, దీనిని కూడా వక్రీకరించిందని, చరిత్ర ఎరిగిన సాక్ష్యమని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మహ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ, ముస్లింల పోరాటంగా వక్రీకరిస్తున్నారని, దీనిని కమ్యూనిస్టు కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి విట్టల్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, బూడిది గోపి, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేశ్, రాపర్తి సోమన్న, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాశ్, సుంచు విజేందర్, తదితరులు పాల్గొన్నారు.
సాయుధ పోరాటంతో పేదలకు
10 లక్షల ఎకరాల భూమి పంపిణీ
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
ఎంఏ బేబీ

చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్