
విద్యాభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
గూడూరు: ఆశ్రమ పాఠశాల ఉద్యోగులు విద్యాభివృద్ధే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని దామరవంచ గిరిజన బాలుర గురుకుల పాఠశాల, కళాశాలను శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కిచెన్, డైనింగ్‌హాల్, పరిసర ప్రాంతాలతో పాటు తరగతి గదులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పక్కా ప్రణాళికతో విద్యార్థులకు డిజిటల్ బోధన చేపట్టాలన్నారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. నిబంధనల ప్రకారం డైట్ మెనూ పాటించాలన్నారు. విద్యార్థుల స్టడీ అవర్స్‌ను ప్రత్యేకంగా పరిశీలించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, సాయంత్రం తప్పకుండా స్టడీ అవర్స్ నిర్వహించాలని, ఏఎన్‌ఎం అందుబాటులో ఉండాలన్నారు.
ఎన్‌హెచ్‌ఎం మెరిట్
జాబితా ప్రదర్శన
నెహ్రూసెంటర్: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో గతంలో ఎంపిక చేసి నిలిపివేసిన ఎంఎల్‌హెచ్‌సీ, ఎంహెచ్‌ఎన్ స్టాఫ్ నర్స్, ఎన్సీడీ స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రొవిజినల్ మెరిట్ జాబితాను ప్రదర్శించినట్లు డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ శనివారం తెలిపారు. జాబితాను మహబూబాబాద్.తెలంగాణ.గవర్నమెంట్.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1నుంచి 5వ తేదీ వరకు కార్యాలయం పనివేళల్లో జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు.
డోర్నకల్ సీఐగా చంద్రమౌళి
డోర్నకల్: డోర్నకల్ పోలీ స్‌స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నియామకమైన చంద్రమౌళి శనివా రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన బి.రాజేష్ ఈ నెల 23న లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే. కాగా 2009 బ్యాచ్‌కు చెందిన చంద్రమౌళి బదిలీపై వచ్చి విధుల్లో చేరారు.
ప్రేమ వ్యవహారంలో ప్రేమికుడి
తల్లి ఆత్మహత్యాయత్నం
బయ్యారం: మండలంలోని కొత్తపేట పంచాయతీలో ఓ ప్రేమ వ్యవహారంలో ప్రేమికుడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివా రం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల ప్రకా రం.. కొత్తపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమించి వెంట తీసుకెళ్లాడు. ఈవిషయం తెలి సిన బాలిక తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫి ర్యాదు చేశారు.ప్రేమ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లిందనే భయంతో యువకుడి తల్లి ఇస్లావత్ స్వప్న తన ఇంట్లో చీరతో ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి స్వప్నను చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
డీఈఓగా దక్షిణామూర్తి
మహబూబాబాద్ అర్బన్: సూర్యాపేట డీఈఓ కార్యాలయంలో ఏడీగా విధులు నిర్వహిస్తున్న పి.దక్షిణామూర్తిని మహబూబాబాద్ జిల్లా డీఈ ఓగా నియమిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్‌నికోలస్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం డీఈఓగా విధులు నిర్వహించిన ఏ.రవీందర్‌రెడ్డి పదవీ విరమణ పొందారు. దీంతో దక్షిణామూర్తి డీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.