
పిల్లలకు తల్లిపాలు మాత్రమే తాగించాలి
నెహ్రూసెంటర్: అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరు నెలల పిల్లలకు తల్లిపాలు మాత్రమే తాగించాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. కాన్పు జరిగిన కొద్ది రోజుల పాటు తల్లిపాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయని, ముర్రుపాలలో ప్రొటీన్లు, రోగ నిరోధనశక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డకు సంజీవని వంటిదని, అమృతంతో సమానమన్నారు. ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అత్యంత ప్రయోజనకరమన్నారు.
సబ్ సెంటర్ ఆకస్మిక తనిఖీ
నర్సింహులపేట: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సబ్ సెంటర్‌ను శుక్రవారం డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు, సీజనల్ జ్వరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవన్నా రు. తండాలు, కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.