వనాలు పెంచుడే.. | - | Sakshi
Sakshi News home page

వనాలు పెంచుడే..

Jul 12 2025 9:51 AM | Updated on Jul 12 2025 9:51 AM

వనాలు

వనాలు పెంచుడే..

శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025

8లోu

శాఖల వారీగా టార్గెట్‌

శాఖ టార్గెట్‌

వ్యవసాయశాఖ 1.92లక్షలు

బీసీ వెల్ఫేర్‌ 5,000

పంచాయతీరాజ్‌ 40,000

గ్రామీణాభివృద్ధి 35.22లక్షలు

ఎకై ్సజ్‌ 68,000

అటవీశాఖ 5.04లక్షలు

వైద్యారోగ్యశాఖ 5,000

ఉద్యాన, పట్టుపరిశ్రమ 1.34లక్షలు

పరిశ్రమలశాఖ 7,000

నీటిపారుదలశాఖ 11,000

ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు 3,000

మైనార్టీ వెల్ఫేర్‌ 5,000

మున్సిపల్‌(ఐదు మున్సిపాలిటీలు) 3.88లక్షలు

పోలీస్‌ 64,000

రోడ్లు, భవనాలు 15,000

పాఠశాల విద్య 20,000

గిరిజన సంక్షేమ, ఐటీడీఏ 30,000

మొత్తం 50.135లక్షలు

సాక్షి, మహబూబాబాద్‌: మనిషి జీవితం.. పుట్టుక నుంచి చావు వరకు చెట్లతోనే ముడిపడి ఉంటుంది. తినే తిండి, పీల్చేగాలి.. కూర్చునే కుర్చి, పడుకునే మంచం, వృద్ధాప్యంలో చేతికర్ర, చ నిపోయిన తర్వాత చితికర్ర ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ చెట్టుతోనే అనుబంధం. ఇంతటి ప్రా ధాన్యత ఉన్న అడవులకు నిలయం మానుకోట. అ యితే రోజురోజుకూ అంతరించిపోతున్న అడవుల పరిరక్షణతో పాటు, వనమహోత్సవం కార్యక్ర మం ద్వారా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని వర్గాలు, అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేశించింది. జిల్లాను ఆకుపచ్చ మానుకోటగా మార్చేందుకు అధికార గణం సిద్ధమవుతోంది.

50.135లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

ఈ ఏడాది వన మహోత్సం కార్యక్రమం ద్వారా జి ల్లాలోని 483 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలతోపాటు సగ భాగంగా ఉన్న అడవి ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 17 శాఖల పరిధిలో మొత్తం 50.135లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 4.91లక్షల గుంతలు తీసి 2.21లక్షల మొక్కలు నాటారు.

గత ఏడాది 90శాతం బతికిన మొక్కలు

గత ఏడాది జిల్లా వ్యాప్తంగా వనమహోత్సం కార్యక్రమం ద్వారా నాటిన వాటిల్లో 90శాతం మొక్కలు బతికినట్లు అధికారులు చెబుతున్నారు. డీఆర్‌డీఏ ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీల్లో 49.45లక్షల మొక్కలను పెంచారు. ఇందులో 44.10లక్షల మొక్కలు నాటారు. ఇందుకోసం రూ. 2,82,97,015 ఖర్చుచేశారు. ఈ ఏడాది రూ.7,32,84,567 ఖర్చుచేసి 31.20లక్షల మొక్కలు పెంచుతున్నారు. అదే విధంగా 1,39,353 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ప్రాంతంలో గత ఏడాది 120.8హెక్టార్లల్లో రూ.81లక్షలు ఖర్చుచేసి 1,42,224 మొక్కలు నాటారు. అలాగే రూ. 34లక్షల కంపా నిధులతో 12కిలో మీటర్ల పరిధిలో హరితనిధి, అమ్మపేరుతో ఒక మొక్క మొదలైన కార్యక్రమాల ద్వారా 25 రకాల చింత, నేరేడు, ఉసిరి, వెదురు తదితర మొక్కలు నాటారు. ఈ ఏడాది 5.04లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

మున్సిపాలిటీల్లో ఇంటికో మొక్క..

వన మహోత్సవంలో విరివిగా మొక్కలు నాటడం, అందరి భాగస్వామ్యం చేసే పనిలో అధికారులు ఉన్నారు. జిల్లాలోని మహబూబాబాద్‌, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్‌, కేసముద్రం మున్సిపాలిటీల్లో 3.88లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆర్‌పీల సహకారంతో ప్రతీ కుటుంబానికి పూల మొక్కలు మందార, గులాబీ, అలంకరణ మొక్కలు పాండమస్‌, ఫెడల్‌అనీస్‌ మొక్కలు సరఫరా చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపులా అందం, అలంకరణ మొక్కలు పులిచెరికలు, గన్నేరు, కాగితపు పూలు, సింగపూర్‌ చెర్రీ, కానుగు మొదలైన మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి మొక్క ఇవ్వడమే కాకుండా పరిరక్షణ బాధ్యత కూడా స్వయం సహాయక సంఘాల మహిళలపై పెడుతున్నారు.

న్యూస్‌రీల్‌

జిల్లాలో వనమహోత్సవానికి సిద్ధం

50.135లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

శాఖలవారీగా లక్ష్యాల కేటాయింపు

ఆకుపచ్చ మున్సిపాలిటీలుగా

మార్చేందుకు కసరత్తు

అడవిలో పండ్ల మొక్కల పెంపకానికి

ప్రాధాన్యం

అటవీ సంరక్షణే ముఖ్యం..

ఇందుకు అందరూ సహకరించాలి

జిల్లా ఫారెస్టు అధికారి

బత్తుల విశాల్‌

సాక్షి, మహబూబాబాద్‌: పేరులోనే మాను ఉన్న మానుకోట జిల్లాను మరింత హరితమయంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని జిల్లా ఫారెస్టు అధికారిఆ బత్తుల విశాల్‌ తెలిపారు. వనమహోత్సవం, అడవులు సంరక్షణ మొదలైన అంశాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

అడవుల సంరక్షణ

జిల్లాలోని మహబూబాబాద్‌ రేంజ్‌ పరిధిలో 39,854హెక్టార్లు, గూడూరు రేంజ్‌లో 99,499 హెక్టార్లు మొత్తం 1,39,353 హెక్టార్లలో ఫారెస్టు పరిధి ఉంది. ఇందులో 39,854హెక్టార్లలో ఫారెస్టు లేకుండా పోయింది. 99,499 హెక్టార్లల్లో ఫారెస్టు ఉంది. జిల్లా భూ విస్తీర్ణంలో అడవి విస్తీర్ణం 47.75శాతం ఉంది. గతంలో ఫారెస్టు ఉన్న ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇందుకోసం హరిత వనాలు, హరితనిధి, అమ్మపేరుతో ఒక మొక్క మొదలైన పేర్లతో మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల్లో 95శాతం సర్వే అయ్యేలా చూస్తున్నాం.

అడవులతోనే జంతువులు

జిల్లాలోని అడవులు రకరకాల జంతువులకు నిలయంగా ఉన్నాయి. ఇందులో అడవి దున్నలు, అడవి కుక్కలు, దుప్పులు, జింకలు, అడవి పందులు, ఎలుగు బంట్లు మొదలైన జంతువులు ఉన్నాయి. ఊట్ల, రాంపూర్‌ మొదలైన ప్రాంతాల్లో పలు సీజన్లలో పులులు కూడా సంచరిస్తున్నాయి. జంతువులకు ఆహారంగా ఉపయోగ పడేలా చింత, నేరేడు, ఉసిరి, పనస మొదలైన మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. జిల్లా అడవుల్లో దొరికే వెదురు నాణ్యమైనదిగా పేరుంది. అదే విధంగా రాష్ట్రంలోనే సుందరమైన పక్షి సంపదకు మహబూబాబాద్‌ అడవులు నిలయంగా మారాయి.

వనాలు పెంచుడే..
1
1/5

వనాలు పెంచుడే..

వనాలు పెంచుడే..
2
2/5

వనాలు పెంచుడే..

వనాలు పెంచుడే..
3
3/5

వనాలు పెంచుడే..

వనాలు పెంచుడే..
4
4/5

వనాలు పెంచుడే..

వనాలు పెంచుడే..
5
5/5

వనాలు పెంచుడే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement