అసౌకర్యాల రైల్వేస్టేషన్‌ | - | Sakshi
Sakshi News home page

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌

Jul 12 2025 9:51 AM | Updated on Jul 12 2025 9:51 AM

అసౌకర

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌

గార్ల: జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్‌లో కనీక సౌకర్యాలు కరువయ్యాయి. తాగునీరు, మరుగుదొడ్లలో నీటి సరఫరా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్లాట్‌ఫాం దెబ్బతినడంతో ప్ర యాణికులు పడుతున్నారు. వానాకాలంలో రేకులషెడ్డు కురుస్తుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈమేరకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఏటా రూ.కోటిపైగా ఆదాయం..

ఏటా గార్ల రైల్వేస్టేషన్‌లో టికెట్లు, రిజర్వేషన్‌ టికెట్ల ద్వారా రూ.కోటి పైగా ఆదాయం సమకూరుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని చింతలపల్లి, ఎల్గూరు, ఇంటికన్నె, గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లకు ఆదా యం లేకున్నా.. రైల్వే ఉన్నతాధికారులు ఆయా స్టేషన్లలో పక్కా భవనాలు, కనీస సౌకర్యాలు కల్పించారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా ప్రయాణికుల ఇబ్బందులు..

రైల్వేస్టేషన్‌లో తాగునీరు, మరుగుదొడ్లలో నీటి వసతి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. మరుగుదొడ్ల డోర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. నిర్వహణ లేకపోవడంతో తీగజాతి మొక్కలు అల్లుకొని అడవిని తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్‌లోని నేమ్‌బోర్డు వద్ద రేకులు లేచిపోయి గోడ కూలి చూడటానికి అందవికారంగా కనిపిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

వర్షం వస్తే అంతే సంగతులు..

ప్రయాణికులకు ప్లాట్‌ఫాంలపై నీడ కోసం సరిపడా రేకుల షెడ్లు ఏర్పాటు చేయలేదు. ఉన్న రేకుల షెడ్లు వర్షం వస్తే కురుస్తున్నాయి. ఇకపోతే రెండో ప్లాట్‌ఫాంపై టైల్స్‌ ధ్వంసంకావడంతో రాత్రి సమయంలో రైలు దిగే ప్రయాణికులు కిందపడిపోతున్నారు. అలాగే బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్‌ భవనం వర్షాకాలంలో కురుస్తోంది. కాగా, ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్‌కు కొత్త భవనం నిర్మించి, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సౌకర్యాలు కల్పించాలి

రైల్వేస్టేషన్‌లో తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లలో నీటి వసతి కల్పించలేదు. మరుగుదొడ్ల డోర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడంలో మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలి.

– కందునూరి శ్రీనివాసరావు, గార్ల

గార్లలో ప్రయాణికులకు తాగునీరు కరువు

మరుగుదొడ్లకు నిలిచిన నీటి సరఫరా

దెబ్బతిన్న రెండో ప్లాట్‌ఫాం

రేకుల షెడ్డు కురుస్తుండడంతో ఇబ్బందులు

పట్టించుకోని రైల్వే అధికారులు

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌1
1/3

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌2
2/3

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌3
3/3

అసౌకర్యాల రైల్వేస్టేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement