
అసంపూర్తిగా డార్మెటరీ భవనాలు
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో డార్మెటరీ(డైనింగ్‌హాల్) నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జిల్లాలో మన ఊరు–మనబడి కింద పలు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లు చేపట్టారు. అయితే నిధులు నిలిచిపోవడంతో సదరు కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు నిలిపివేయడంతో భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నా యి. దీంతో విద్యార్థులు వరండాలు, చెట్ల కింద కూర్చొని భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది.
నిరుపయోగం..
కురవి, సీరోలు మండలాల్లోని రాజోలు, మోద్గులగూడెం, కొత్తూరు(సీ), చింతపల్లి, కాంపల్లి, సీరోలు జెడ్పీ హైస్కూళ్లలో డార్మెటరీ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో అవి నేడు నిరుపయోగంగా మారాయి. అయితే సీరోలులో మాత్రం అసంపూర్తి భవనంలో విద్యార్థులు కూర్చొని భోజనం చేస్తున్నట్లు సమాచారం. నిర్మాణాలు పూర్తి చేస్తే వర్షాకాలంలో వాటిలో కూర్చొని భోజనం చేసే అవకా శం ఉండేది. అధికారులు, ప్రజాప్రతినిధులు పరి శీలించి నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకో వా లని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
డైనింగ్ హాల్స్ పూర్తి చేయాలి
జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డార్మెటరీ నిర్మాణాలను పూర్తి చేయాలి. విద్యార్థులు వరండాలు, చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. మధ్యలో నిలిచిన పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందించాలి.
– జ్యోతిబసు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు
నిధులు రాకపోవడంతో నిలిపివేసిన కాంట్రాక్టర్లు
డైనింగ్‌హాల్ లేక విద్యార్థుల ఇబ్బంది
త్వరగా పూర్తిచేయాలని కోరుతున్న తల్లిదండ్రులు

అసంపూర్తిగా డార్మెటరీ భవనాలు