
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
మరిపెడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మరిపెడలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగా దశలవారీగా నిర్మాణం పూర్తి అయిన ఇళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి బిల్లులు త్వరగా పడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక పీహెచ్‌సీని ఆయన పరిశీలించారు. ప్రస్తుత వాతవరణ మార్పుల కారణంగా జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైన చోట వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలన్నారు. గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీల్లో పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహిస్తూ షెడ్యుల్ ప్రకారం శానిటేషన్ నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణవేణి, హౌసింగ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.