మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే ప్రధాన ఏజెండాగా గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లో ఉన్న ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరుపరచాలని సూచించారు. పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్షులను సరైన సమయంలో హాజరుపరచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణతేజ్, తొర్రూర్ జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్, డీపీఈఓ కిరణ్, డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్, సీఐలు, ఎస్సైలు, ఎకై ్సజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ
పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలి