
తహసీల్దార్ విచారణ
గార్ల: కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని సాక్షి దినపత్రికలో ‘వసూళ్ల పర్వం!’ అనే శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఈమేరకు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారద కిందిస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించి, సిబ్బందిని విచారించినట్లు తెలిసింది. కొత్త రేషన్‌కార్డుల మంజూరులో సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక నుంచి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని తహసీల్దార్ తెలిపారు.
కుష్ఠువ్యాధి నిర్మూలనకు
కృషి చేయాలి
మహబూబాబాద్ రూరల్ కుష్ఠువ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని లెప్రసీ ప్రోగాం ఆఫీసర్ విజయ్‌కుమార్ అన్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందితే పూర్తిగా నిర్మూలించవచ్చని సూచించారు. వ్యాధికి ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎండీటీ చికిత్స అందుబాటులో ఉందని, బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కుష్ఠు వ్యాధి నిర్మూలన బృందం సభ్యులు, వెంకటాచారి, సుకులారెడ్డి, శ్రీని వాసరెడ్డి, డీపీఎంఓ వాల్యా, మౌనిక, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాగర్, హెచ్‌ఈఓ శ్రీనివాస్, హెచ్‌వీ పుష్పలీల, పీడీఎంఓలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బందులకు
గురిచేయొద్దు
నెల్లికుదురు: రైతుల పంటలకు విద్యుత్, ఎస్సారెస్పీ సాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్ అధికారులను హెచ్చరించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సాగునీరు, విద్యుత్ సమస్యలపై సోమవారం ఆయాశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు కాల్వల ద్వారా నీటిని తరలించాలన్నారు. గ్రామాల్లో చిన్నచిన్న విద్యుత్ సమ్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేశ్, ఎంపీడీఓ బాలరాజు, విద్యుత్, ఇరిగేషన్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

తహసీల్దార్ విచారణ

తహసీల్దార్ విచారణ