
విద్యాశాఖ ఉద్యోగులకు అండగా నిలుస్తాం
తొర్రూరు: విద్యాశాఖ ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన సీఆర్‌పీ సర్వి రమేశ్ కుటుంబానికి సమగ్రశిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులు రూ.3.20 లక్షల ఆర్థిక సాయం అందించారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని వారి నివాసంలో డీఈఓ చేతుల మీదుగా మృతుడి కుటుంబ సభ్యులకు ఆ మొత్తం అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంచడంలో, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో సీఆర్‌పీల పాత్ర మరువలేనిదన్నారు. రమేశ్ మృతి విద్యాశాఖకు తీరని లోటు అని అన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెల్తూరి మల్లేశం, ఉపాధ్యాయ నాయకులు పులి ముత్తిలింగం, కొలుపుల శ్రీనివాస్, తిరుమలేష్, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి