
వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
మహబూబాబాద్: ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సీఎస్ రామకృష్ణారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు ప్రభు త్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000లకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశామన్నారు. ప్రతీ పట్టణంలో కనీసం 500 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. రైతులకు సమృద్ధిగా ఎరువుల సరఫరాకు పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. 1,25,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు విస్తీర్ణం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 15 నాటికి భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిష్కారం పూర్తి అవుతుందన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీఏఓ విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.