ఉమ్మడి జిల్లాస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ విజేత కానిపర్తి | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ విజేత కానిపర్తి

Jun 24 2025 3:33 AM | Updated on Jun 24 2025 3:33 AM

ఉమ్మడి జిల్లాస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ విజేత కానిపర్తి

ఉమ్మడి జిల్లాస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ విజేత కానిపర్తి

కమలాపూర్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ విజేతగా హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని కానిపర్తి జట్టు నిలిచింది. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్‌నగర్‌లో నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి ఆహ్వానిత బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కానిపర్తి, భూపాలపల్లి జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్‌లో భూపాలపల్లి జట్టుపై కానిపర్తి జట్టు గెలిచి టోర్నీని కై వసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు నిర్వాహకులు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. కానిపర్తి జట్టుకు కోచ్‌గా కన్నెబోయిన కిరణ్‌యాదవ్‌, కెప్టెన్‌గా దాసరి రమేష్‌ వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement