ఓపెన్‌ స్కూల్‌.. ఓ వరం | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌.. ఓ వరం

Jun 24 2025 3:33 AM | Updated on Jun 24 2025 3:33 AM

ఓపెన్

ఓపెన్‌ స్కూల్‌.. ఓ వరం

విద్యారణ్యపురి : ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కారణాల వల్ల పాఠశాల స్థాయిలోనే కొందరు చదువును మధ్యలో మానేస్తున్నారు. మరికొందరు పదోతరగతి పూర్తయ్యాక ఇంటర్‌ చదువును కొనసాగించలేక పోతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిలు చేయడంతో చదువుకోనే అవకాశం లేదు. ఇలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ద్వారా మళ్లీ చదివేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇది ఓ రకంగా చదువును మధ్యలో మానేసిన వారికి వరం లాంటిదంటే అతిశయోక్తి కాదు. సార్వత్రిక విద్యను దూరవిద్య విధానంలో అందిస్తోంది. ఓపెన్‌ స్కూల్‌ విధానంలో టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హనుమకొండ, వరంగల్‌, ములుగు, జనగామ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మొత్తంగా 117 అధ్యయన కేంద్రాలు (ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు)ఉన్నాయి. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ఓపెన్‌ స్కూల్‌ విధానంలో పదోతరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 2010–11 నుంచి ఇంటర్‌లో ప్రవేశాలు అందుబాటులోకి వచ్చాయి.

ఆగస్టు12వరకు అడ్మిషన్లు..

గతంలో ప్రతి ఏటా జూలై–ఆగస్టులో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ ప్రా రంభమయ్యేది. ఈసారి అలా కాకుండా రెగ్యులర్‌ విధానం వల్లే ఈ విద్యాసంవత్సరం 2025–26లో ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియ ను అధికారులు ప్రారంభించి ఆగస్టు 12వ తేదీవరకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్‌లైన్‌లో సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా మీసేవా సెంటర్లలోనే ఫీజు చెల్లించి అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు పొందవచ్చు.

అక్షరాస్యత శాతం పెంచేందుకు..

ఓపెన్‌ స్కూల్‌ విధానంలో టెన్త్‌, ఇంటర్‌లో అడ్మిషన్ల ప్రక్రియకు అర్హులైన అభ్యాసకులు దరఖాస్తు చేసుకుంటారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) ప్రాజెక్టు ద్వారా ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశాలకు అర్హులైన వారిని కూడా సంబంధిత అధికారులు గుర్తిస్తున్నారు. ఉల్లాస్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌, డీడీలను, సెర్ప్‌, మెప్మా, సెల్ప్‌ హెల్ప్‌ గ్రూప్స్‌, వీఓ, సీఆర్పీలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ఎంఈఓలు, ఏఐ కోఆర్డినేటర్ల సహాయంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టెన్త్‌, ఇంటర్మీడియట్‌ చదివేందుకు అర్హులైన వారిని గుర్తిస్తున్నారు. టాస్‌లో అడ్మిషన్లు కల్పించేందుకు సర్వే ప్రక్రియ సైతం మొదలెట్టారు. అలా ఇప్పటి వరకు టెన్త్‌కు 1,581మందిని, ఇంటర్‌లో 1,952 మందిని గుర్తించారు. అడ్మిషన్లు పొందిన వారు ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రాల్లో తరగతులకు హాజరు కావాల్సింటుంది. పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. అలాగే ప్రతి రెండో శనివారం, ఆదివారం తరగతులు నిర్వహిస్తారు.

ఉమ్మడి జిల్లాకు అడ్మిషన్ల టార్గెట్‌ 11,616

ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్‌ స్కూల్‌ విధానంలో టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలకు 11,616 మంది అడ్మిషన్లను నిర్దేశించారు. గతేడాది టెన్త్‌, ఇంటర్‌లో 6,849 మంది అడ్మిషన్లు పొందారు. అందులో టెన్త్‌లో 2,401మంది, ఇంటర్‌లో 4,448 మంది ఉన్నారు.

చదువు మానేసిన వారికి సువర్ణావకాశం

ఈసారి ముందస్తుగానే

టెన్త్‌, ఇంటర్‌లో ప్రవేశాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా

117 అధ్యయన కేంద్రాలు

దరఖాస్తులు ఇలా..

ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌లో ప్రవేశాలకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. కనీస వయస్సు 15ఏళ్లు నిండి ఉండాలి. ఆపై వయస్సుగలవారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చును. గరిష్ట వయోపరిమితి లేదు.

తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ మీడియంలో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

తహసీల్దార్‌ లేదా మున్సిపల్‌ నుంచి జారీ

చేసిన బర్త్‌ సర్టిఫికెట్‌ ఉంటే సరిపోతుంది.

పాఠశాల స్థాయిలో చదువు మానేస్తే ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ), ఆధార్‌ కార్డుతో ప్రవేశం పొందవచ్చు.

ఇంటర్‌లో ప్రవేశాలకు తప్పనిసరిగా

పదో తరగతి పాస్‌ కావాల్సి ఉంటుంది.

ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 12వతేదీ వరకు అడ్మిషన్లు పొందాలి.

పదోతరగతిలో ప్రవేశాలకు ఫీజు ఓసీ అభ్యాసకులకు రూ.1,550, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1,150 చెల్లించాలి.

ఇంటర్‌లో అడ్మిషన్లకు ఓసీలకు రూ.1,800, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యాసకులు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుంది.

టీజీ ఆన్‌లైన్‌లో మీసేవా కేంద్రాల ద్వారా లేదా ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులు చెల్లించి తమకు సమీపంలోని ఓపెన్‌ స్కూల్‌ అధ్యయన కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించి అడ్మిషన్లు తీసుకోవాలి.

రెగ్యులర్‌ విద్యతో సమానం..

ఓపెన్‌ స్కూల్‌లో టెన్త్‌, ఇంటర్‌ను పూర్తి చేసిన వారికి రెగ్యులర్‌ చదువుతో సమానమైన గుర్తింపు ఉంటుంది. ఆగస్టు 12వరకు అడ్మిషన్లు కొనసాగుతాయి. ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌ పూర్తి చేసిన వారు ఆపై విద్యకు, ఇంటర్‌ పూర్తిచేసిన వారు ఉన్నత విద్యకు కూడా అర్హులే. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌. ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో కూడా పూర్తి వివరాలు లభిస్తాయి. ఉల్లాస్‌ ప్రాజెక్టు ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నాం. వారిని కూడా అడ్మిసన్లకు ప్రోత్సహించే ప్రక్రియ చేపట్టాం. ఆసక్తి గల వారికి ఇది ఒక అవకాశంగా భావించాలి

– అనగోని సదానందం, ఓపెన్‌ స్కూల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌

ఓపెన్‌ స్కూల్‌.. ఓ వరం1
1/1

ఓపెన్‌ స్కూల్‌.. ఓ వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement