ఆదర్శం.. కల్వల బడి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. కల్వల బడి

Jun 21 2025 3:00 AM | Updated on Jun 21 2025 3:00 AM

ఆదర్శ

ఆదర్శం.. కల్వల బడి

కేసముద్రం: జిల్లాలో విద్యాబోధన, సౌకర్యాలు సరిగా లేక విద్యార్థులు రాక పలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం చూస్తున్నాం. అయితే అందుకు భిన్నంగామండలంలోని కల్వల ప్రాథమిక పాఠశాలలో అన్ని సౌకర్యాలతో పాటు మెరుగైన విద్యాబోధన ఉండడంతో రికార్డుస్థాయిలో 80అడ్మిషన్లు అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు చుట్టూ పక్కల గ్రామాలు, తండాల్లో ఇంటింటికీ తిరిగి విద్యా బోధన, సౌకర్యాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వివరించారు. దీంతో పాఠశాలలో రికార్డుస్థాయిలో అడ్మిషన్లు అయ్యాయి.

142మంది విద్యార్థులు..

పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు ఉండగా, కొత్తగా అడ్మిషన్లు పొందిన 80మందితో కలిపి 142 మంది విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ పరిధి అమీనాపురం గ్రామం నుంచి 25మంది విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రత్యేక వాహనంలో కిరాయి చెల్లించి కల్వల పాఠశాలకు పంపిస్తుండడం విశేషం. అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సయ్యద్‌, వీఆర్‌ఏ మహేశ్‌, నవోదయ గెస్ట్‌ లెక్చరర్‌ తమ పిల్లలను ఇదే పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

సౌకర్యాలు ఇవే..

● దాత సహకారంతో పిల్లలకు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

● ప్రాజెక్ట్‌ వర్క్‌కుగాను అందుబాటులో కలర్‌ ప్రింటర్‌ జిరాక్స్‌ ఏర్పాటు

● ప్రతీ సంవత్సరం పిల్లలను విహారయాత్రకు తీసుకెళ్లడం

● క్రీడా సామగ్రి సౌకర్యంతో పాటు ఆటల్లో మెళకువలు నేర్పించడం

● ప్రతీనెల మూడో శుక్రవారం తల్లిదండ్రులతో సమావేశం

● ప్రైవేట్‌ స్కూల్‌కు దీటుగా పాఠశాల భవనానికి రంగులు, ఆంగ్లంలో బోధన

● ప్రతిభ కనబర్చే విద్యార్థులకు బహుమతులు అందజేత

రికార్డు స్థాయిలో

ప్రాథమిక పాఠశాలలో 80 అడ్మిషన్లు

విద్యాబోధన, సౌకర్యాలకు

ఆకర్షితులవుతున్న పిల్లలు

చుట్టుపక్కల గ్రామాలు,

తండాలనుంచి వస్తున్న విద్యార్థులు

విద్యాసామర్థ్యాలు సంపూర్ణంగా సాధించాం..

తరగతుల వారీగా విద్యాసామర్థ్యాలను సంపూర్ణంగా సాధించగలిగాం. ఉపాధ్యాయులు బోధించే తీరు, పిల్లల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆకర్షితులైన తల్లిదండ్రులు వారి పిల్లలను మా పాఠశాలకు పంపిస్తున్నారు. సొంతంగా రూ.46వేలతో స్కూల్‌ బిల్డింగ్‌కు రంగులు వేయించా. బుధ, శనివారాల్లో ధరించాల్సిన ప్రత్యేక యూనిఫాంలను ఇప్పటికే పిల్లలకు అందజేశాం. ఇంగ్లిష్‌లో బోధిస్తున్నాం. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పిల్లలు వస్తున్నారు. జిల్లాలోనే రికార్డుస్థాయిలో 80 అడ్మిషన్లు సాధించాం. గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.

–కల్లెం వీరారెడ్డి, హెచ్‌ఎం, కల్వల పీఎస్‌

అర్థమయ్యేలా చదువు చెబుతున్నారు..

నేను కేసముద్రంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 2వ తరగతి వరకు చదివిన. 3వ తరగతిలో మా కల్వల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చేరా. ఇక్కడ ఇంగ్లిష్‌ మీడియంలో టీచర్లు చదువు చెబుతున్నారు. ప్రతీ సబ్జెక్టు నాకు సులువుగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆటలు ఆడించడం, ఎలాంటి డౌట్స్‌ ఉన్నా టీచర్లు క్లియర్‌ చేస్తారు. ప్రతీ సంవత్సరం టూర్‌కు తీసుకెళ్తారు.

–పెద్దారపు రుచిత, 5వ తరగతి విద్యార్థిని, కల్వల

ఆదర్శం.. కల్వల బడి1
1/4

ఆదర్శం.. కల్వల బడి

ఆదర్శం.. కల్వల బడి2
2/4

ఆదర్శం.. కల్వల బడి

ఆదర్శం.. కల్వల బడి3
3/4

ఆదర్శం.. కల్వల బడి

ఆదర్శం.. కల్వల బడి4
4/4

ఆదర్శం.. కల్వల బడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement