అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి | - | Sakshi
Sakshi News home page

అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి

Jun 20 2025 6:29 AM | Updated on Jun 20 2025 6:29 AM

అడవి

అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి

టేకుమట్ల: గాజర్ల రవి.. పెత్తందార్లు, దొరల అరాచకాల నుంచి పీడిత ప్రజల విముక్తి కోసం మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు సానుభూతిపరుడిగా, విద్యార్థి యూనియన్‌ నాయకుడిగా ఉద్యమంలోకి అడుగు పెట్టి దళ కమాండర్‌ బాధ్యతలు చేపట్టాడు. నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుని అన తి కాలంలోనే నార్త్‌ తెలంగాణ డివిజన్‌ కమిటీకి ఎన్నికై కేంద్ర కమిటీ సభ్యుడిగా, స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు తీసుకుని ఉద్యమంలో నూతన ఒరవడికి నాంది పలికాడు. ఎన్నో కీలక ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి 1992లో అడవి బాట పట్టాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగాడు.

ఉద్యమాలే ఊపిరిగా..

కుటుంబ సభ్యుల కన్నా ఉద్యమాలే ఊపిరిగా, ప్ర జా శ్రేయస్సే ధ్యేయంగా మూడు దశాబ్దాలుగా అడ వి తల్లి ఒడిలో కాలం గడిపాడు. తల్లిదండ్రులను సైతం కాదని అడవి తల్లి చెంతకు చేరిన గాజర్ల రవి ఉద్యమ ప్రస్థానం బుధవారంతో ముగియడంతో శుక్రవారం పుడమి తల్లి ఒడికి చేరనున్నాడనని నా టి ఉద్యమకారులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. రవి జ్ఞాపకార్థం వెలిశాలతోపాటు, పలు గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

చివరి చూపు కోసం ఎదురుచూపు..

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌ మృతి చెందాడనే సమాచారం సోషల్‌మీడియాలో దావానంలా వ్యాపించడంతో వెలిశాల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రోజులుగా గాజర్ల రవి చివరి చూపు కోసం జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. గురువారం రాత్రి రంపచోడవరంలో పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో సోదరులు గాజర్ల సమ్మయ్య, అశోక్‌.. రవి పార్థివదేహాన్ని స్వగ్రామం వెలిశాలకు తీసుకురానున్నారు. కాగా, బుధవారం నుంచే వెలిశాలలో పోలీసులు రెక్కీ నిర్వహిస్తున్నారు.

చర్చల సమయంలో చివరిగా చూశా..

2004లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు మావోయిస్టులను చర్చలకు పిలువగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి రవ(రవి)న్న చర్చల ప్రతినిధిగా వస్తున్నాడని తెలిసి వెళ్లా. ఎంతో మంది ప్రజలు హాజరైన కార్యక్రమంలో దూరం నుంచి చూశా. ఇప్పుడు విగత జీవిగా చూస్తామని అనుకోలేదు.

–అచ్చె లచ్చన్న, మాజీ సర్పంచ్‌,

రామకిష్టాపూర్‌(వి)

నేడు మావోయిస్టు నేత గాజర్ల రవి అంత్యక్రియలు

స్వగ్రామం వెలిశాలలో

ఆయన జ్ఞాపకార్థం వెలిసిన ఫ్లెక్సీలు

చివరి చూపు కోసం గ్రామస్తుల ఎదురుచూపు

అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి 1
1/1

అడవి నుంచి.. పుడమి తల్లి ఒడికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement