
● తల్లి ఇక లేదని తెలియక..!
విద్యుదాఘాతంతో మృతిచెందిన తల్లికోతి వద్ద పిల్లకోతి పడిగాపులు
అప్పటి వరకు తల్లికోతి తన కడుపులో పుట్టిన పిల్ల కోతిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంది. తినడానికి పండ్లు, ఇతర తినుబండారాలు సేకరించి ఇచ్చింది. సరదాగా కాసేపు ఒళ్లో పడుకోబెట్టుకుంది. ఒక చెట్టుపై నుంచి మరోచెట్టు మీదకు దూకుతూ ఆటలాడించింది. ఈక్రమంలో తల్లి కోతి విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన బయ్యారం బస్టాండ్ సెంటర్లో మంగళవారం జరిగింది. కాగా, మృతి విషయం తెలియక పక్కనే దీనంగా పిల్లకోతి కూర్చొని తల్లికోతిని తట్టిలేపుతున్న దృశ్యం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. కాసేపటి తర్వాత కొందరు ఆ కోతి పిల్లను దగ్గరకు తీసుకొని తమ వెంట తీసుకెళ్లారు. – బయ్యారం