హెమోఫిలియా బాధితులకు మందుల పంపిణీ
విద్యారణ్యపురి: హెమోఫిలియా సొసైటీ వరంగల్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని రెడ్‌క్రాస్ సొసైటీ హాల్‌లో ఇంటన్స్ ఫార్మా వారి సహకారంతో హిమోఫిలియా వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీచేశారు. హెమోఫిలియా అనేది రక్తస్రావం జరగడం వల్ల సంక్రిమించేవ్యాధి అని, ఇది వంశపారంపర్యంగా ఫాక్టర్ 7, 8, 9 లోపించడం వల్ల వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈవ్యాధిగ్రస్తులకు దంత పరమైన సమస్యల గురించి డాక్టర్ సంఘర్ష్ వివరించారు. ఇంటన్స్ ఫార్మా హెమోఫిలియా వరంగల్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ నారెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 120 మంది వ్యాధిగ్రస్తులకు మందులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్, పాపిరెడ్డి, ఎంసీ మెంబర్ పుల్లూరు వేణుగోపాల్ పాల్గొన్నారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
భూపాలపల్లి అర్బన్: క్రీడలలో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల స్థాయి అండర్–19 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. భూపాలపల్లి–ములుగుల మధ్య జరిగిన మ్యాచ్‌ను బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. 40 రోజుల నుంచి జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వంద మంది క్రీడాకారులకు సర్టిఫికెట్‌లు ప్రదానం చేసి మాట్లాడారు. క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం నూతన పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. ఏదో ఒక క్రీడను ఎంచుకుంటే ప్రతీ విద్యార్థికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సిరిమళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కోచ్ రాజు కుమార్ పాల్గొన్నారు.
హెమోఫిలియా బాధితులకు మందుల పంపిణీ


