ఏీపీ ఎప్‌సెట్‌లో మనోళ్ల ప్రతిభ
విద్యారణ్యపురి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈఏడాదిలో నిర్వహించి ఆదివారం విడుదల చేసిన ఏపీ ఎప్‌సెట్ పరీక్ష ఫలితాల్లో మనోళ్లు అత్యంతప్రతిభ చూపి ర్యాంకులు సాధించారు. ఎప్‌సెట్ ఇంజనీరింగ్‌లో హనుమకొండ వడ్డేపల్లి సురేంద్రపురికాలనీకి చెందిన శాగంటి త్రిశూల్ రాష్ట్రస్థాయిలో 92.5801 కంబైన్డ్ స్కోఽర్‌తో 8వ ర్యాంకు సాఽధించాడు. టెన్త్ హనుమకొండ శ్రీచైతన్యలో చదివిన అతను ఇంటర్ హైదరాబాద్ శ్రీచైతన్యలో 986 మార్కులు తెచ్చుకున్నాడు. అయితే త్రిశూల్ ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ఆల్‌ఇండియాలో 579వ ర్యాంకు సాధించాడు. ఖరగ్‌పూర్/కాన్పూర్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలనే లక్ష్యంగా ఉందని, సీటు వస్తుందని భావిస్తున్నామని త్రిశూల్ తెలిపాడు. త్రిశూల్ తల్లి సబిత, నర్సయ్య ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే.
అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీలో షణ్ముక్‌కు
4వ ర్యాంకు
ఏపీ ఎప్‌సెట్ ఫలితాల్లో అగ్రికల్చ రల్ అండ్ ఫార్మసీలో 92.3809 స్కోర్‌తో హనుమకొండ సుబేదారి టీచర్సకాలనీ ఫేజ్–1కు చెందిన ఎండ్రపాటి శ్యాంసుందర్, రజనీ దంపతుల కుమారుడు షణ్ముక్ 4వ ర్యాంకు సాధించాడు. అతడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే షణ్ముక్ ఇప్పిటికే నీట్ పరీక్ష రాశాడు. డాక్టర్ కావాలనేది తన లక్ష్యమని తెలిపాడు. నీట్ కీ ఇప్పటికే విడుదలేందని, మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నాడు. ఎంబీబీఎస్‌లో సీటు లభిస్తుందని ఆశిస్తున్నాడు. రాకపోతే ఫార్మసీలో అడ్మిషన్ తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపాడు. ఇంటర్ హైదరాబాద్ శ్రీచైతన్యలో చదివిన శన్ముఖ్ 987 మార్కులు సాధించాడు. టెన్త్ హనుమకొండ శ్రీచైతన్యలో చదివి 10/10జీపీఏ తెచ్చుకున్నాడు.
ఇంజనీరింగ్‌లో శాగంటి త్రిశూల్‌కు
8వ ర్యాంకు
ఏీపీ ఎప్‌సెట్‌లో మనోళ్ల ప్రతిభ


