రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ
బాలికల జట్టులో వరంగల్ జట్టుకు ప్రథమ స్థానం, బాలురలో ద్వితీయస్థానం
నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 47వ హ్యాండ్‌బాల్ తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర విభాగంలో కరీంనగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో వరంగల్ జట్టు, తృతీయ స్థానంలో నల్లగొండ జట్టు నిలిచింది. బాలికల విభాగంలో వరంగల్ జట్టు ప్రథమ స్థానం, ఖమ్మం జట్టు ద్వితీయ, రంగారెడ్డి జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించాయి.
రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ప్రతిభ


