
ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే సుస్థిర పాలన
మహబూబాబాద్ అర్బన్ : ఒకే దేశం–ఒకే ఎన్నిక విధానంతో సుస్థిరపాలన అందించవచ్చని బీజేపీ రాష్ట్ర కోకన్వీనర్ శ్రీరామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించా రు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంతో దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి 100రోజుల్లోపు జరుగుతాయని, తద్వారా ప్రజాపాలన సులభం అవుతుందని, దేశ సంప ద, అధికార యంత్రాంగం శ్రమ వృథా కాదన్నారు. దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రరావు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ మహేశ్‌గౌడ్, కోకన్వీనర్ సందీప్‌గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ సతీష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు అశోక్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాంబాబు నాయక్ ఉన్నారు.