
త్రివేణి సంగమం.. జనసంద్రం
పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులు
భూపాలపల్లి/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్న సరస్వతీనది పుష్కరాలు పదకొండు రోజుకు చేరుకున్నాయి. ఆదివారం సెలవుదినం సందర్భంగా తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కాళేశ్వరానికి భారీగా తరలి వచ్చారు. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో పుష్కర స్నానాలు ఆచరించి, నదీ మాతకు పూజలు చేశారు. పిండప్రదాన పూజలు చేశారు. నదీమాతకు చీర, సారె సమర్పించారు. దంపతిస్నానాలు చేసి దొప్పల్లో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. ఘాటుపై ఏర్పాటు చేసిన 17 అడుగుల సరస్వతీమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. క్యూలైన్‌లో బారులుదీరడంతో రాత్రి వరకు ఆలయంలో రద్దీ నెలకొంది.
రెండు లక్షల మంది భక్తుల రాక..
వివిధ రాష్ట్రాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాల్లో భక్తులు త్రివేణి సంగమం సరస్వతీనదికి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. సోమవారంతో పుష్కరాలు ముగియనుండంతో భక్తులు ఆదివారం భారీగా కాళేశ్వరం బాటపట్టారు. రెండు లక్షల మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వా మివారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా.
ట్రాఫిక్ జామ్..
కాళేశ్వరానికి భక్తులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో తరలిరావడంతో పోలీసులు అన్నారం క్రాస్ నుంచి వయా మద్దులపల్లి మీదుగా వన్ వే ఏర్పా టు చేసి వాహనాలు తరలించారు. మంచిర్యాల వైపు నుంచి వచ్చేవాహనాలు అంతర్రాష్ట్ర వంతెన వద్ద నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగింది. ప్రాణహిత వంతెన వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. భక్తులు పార్కింగ్ స్థలాల నుంచి కాలినడకన ఘాట్ వరకు నడిచివెళ్లారు. మహదేవపూర్ నుంచి వచ్చే వాహనాలు మధ్యాహ్నం నుంచి వన్‌వే తీయడంతో టూ వే ద్వారా మళ్లీ తరలివచ్చాయి. కలెక్టర రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే ట్రాఫిక్‌ను సమీక్షించారు.
ఆర్టీసీ బస్సులు లేక అవస్థలు..
భక్తులు తిరుగు ప్రయాణంలో బస్సులు సరిపడా లేక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ సాయంత్రం వేళల్లో బస్సులు అధిక సంఖ్యలో నడిపించడం లేదని భక్తులు ఆరోపించారు.
పోలీసుల అత్యుత్సాహం..
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పుష్కరాల పర్యటన సందర్భంగా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఐడీకార్డులు ఉన్న వారి ద్విచక్రవాహనాలనూ అనుమంతించలేదు. అలాగే, మీడి యా ప్రతినిధులతోనూ వాగ్వాదానికి దిగారు. ప్రధాన ఆలయం మండపంలోకి వెళ్లే గేటు వద్ద ఎస్సై ఎస్.రాజేశ్.. ఉత్సవ కమిటి సభ్యుడు అశోక్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడున్న వారు సముదాయించే ప్రయత్నంలో అన్న సంబోధించగా ఎస్సై కో పోద్రెకుడయ్యాడు. తాను సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను అని, తనను సార్ అని సంబోంధించాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఎస్సైపై సీఐకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
ఘనంగా హారతి..
సరస్వతిఘాట్ వద్ద ఆదివారం రాత్రి కాశీపండితులతో నవరత్నమాల హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏడుగురు పండితుల బృందం తొమ్మిది హారతులను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. 45 నిమిషాల పాటు జరిగే హారతి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మంత్రులు దుద్దిళ్ల ఽశ్రీధర్‌బాబు, సీతక్క, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్‌రా వు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ , భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎంఓ కార్యదర్శి శ్రీనివాస రాజు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, ఈఓ మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల పుష్కర స్నానం
కాటారం/కాళేశ్వరం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీ నది పుష్కరాల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, యోగా నంద సరస్వతి స్వామి, ఎమ్మెల్సీ సురభివాణి, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎంపీ నాందేవ్ కిర్సాన పుణ్యస్నానం ఆచరించారు. అలాగే, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజారామయ్యార్ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా, హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్‌కు రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే స్వాగతం పలికి పుష్ఛ గుచ్చం అందజేశారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు గవర్నర్ దంపతులకు వేదాశీర్వచనం చేశారు.
పుష్కర స్నానాలకు పోటెత్తిన భక్తజనం
ఉదయం నుంచి రాత్రి వరకు
కొనసాగిన రద్దీ
11వ రోజు రెండు లక్షల మంది వరకు రాక
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, యోగానందాసరస్వతిస్వామి, సినీనటుడు తనికెళ్ల భరణి పుష్కర స్నానాలు, పూజలు
కాశీపండితులతో నవరత్నమాల హారతి

త్రివేణి సంగమం.. జనసంద్రం

త్రివేణి సంగమం.. జనసంద్రం

త్రివేణి సంగమం.. జనసంద్రం

త్రివేణి సంగమం.. జనసంద్రం

త్రివేణి సంగమం.. జనసంద్రం

త్రివేణి సంగమం.. జనసంద్రం