
కాళేశ్వరానికి పెరిగిన భక్తులు
● బస్సులు సమకూర్చిన అధికారులు
● నేడు భక్తుల రద్దీ పెరిగే
అవకాశం
హన్మకొండ: సరస్వతీనది పుష్కరాలు ముగింపు సమీపిస్తుండడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నెల 26తో పుష్కరాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఆర్టీసీకి భక్తులు ఒక్కసారిగా పెరిగారు. ఉదయం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌తో పాటు వరంగల్ రీజియన్‌లోని ఇతర బస్ స్టేషన్లు భక్తుల రాకతో కిక్కిరిసిపోయాయి.అధికారులు అప్పటికప్పుడు బస్సులు సమకూర్చి భక్తులను చేరవేశారు. సోమవారం కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 15 నుంచి 24 వరకు 5574 ట్రిప్పుల ద్వారా 3,30,218 భక్తులను చేరవేశారు. వివిధ బస్ స్టేషన్ల నుంచి కాళేశ్వరానికి 3,347 ట్రిప్పుల ద్వారా 1,70,523 మందిని చేరవేయగా, తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి వివిధ బస్ స్టేషన్లకు 2,227 ట్రిప్పుల ద్వారా 1,59,695 మంది భక్తులను చేరవేశారు.
సరస్వతి పుష్కరాలకు తరలిన భక్తుల సంఖ్య
తేదీ కాళేశ్వరం వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణమైన భక్తులు
ట్రిప్పులు భక్తులు ట్రిప్పులు భక్తులు
15న 123 4,198 117 3,287
16న 238 10,002 219 8,805
17న 259 12,324 240 9,869
18న 376 18,838 367 18,608
19న 310 15,152 307 14,474
20న 266 11,235 257 10,847
21న 374 19,028 359 17,996
22న 362 19,450 361 17,773
23న 445 24,786 434 24,971
24న 594 35,510 565 33,065
భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలి
భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలి. మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
డి.విజయభాను ఆర్టీసీ ఆర్‌ఎం, వరంగల్

కాళేశ్వరానికి పెరిగిన భక్తులు