దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌ను హైదరాబాద్‌లోని రైలు నిలయంలో బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్య కలిశారు. పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కాజీపేట బస్టాండ్ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, అమృత్‌భారత్ పథకం కింద వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, రైల్వే క్రూలింక్‌ల తరలింపు విషయంలో వివరణ, రైల్వే యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరించాలని జీఎంను కోరారు. మూడు రోజుల్లో నాయకులతో సమావేశం కానున్నట్లు జీఎం చెప్పారని ఎంపీ తెలిపారు. కాజీపేట లోకోరన్నింగ్ డిపో సిబ్బందిని విజయవాడ డిపోనకు బదిలీ చేయడం, కాజీపేటలో కొత్త పోస్టుల భర్తీకి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై జీఎంను వివరణ కోరినట్లు తెలిపారు. కాజీపేటలో 709 మంది ఉద్యోగులకు 526మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారని, రన్నింగ్‌స్టాఫ్‌లో 184 కొత్త పోస్టింగ్‌లు మంజూరైన పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రయత్నాలూ లేవని, దీంతో ఉద్యోగులపై పనిభారం పడుతుందని జీఎంకు వివరించారు. 2022 జూలై 14న రైల్వే అధికారులతో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో రైల్వే అథారిటీ ఇచ్చిన హామీలను ఉల్లంఘించి కృష్ణా, ఎల్‌టీటీ, కోణార్క్, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల ను కాజీపేట నుంచి విజయవాడ డిపోనకు తరలిస్తున్నారన్నారు. కాజీపేట డివిజన్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని జీఎంను కోరినట్లు తెలిపా రు. ప్రస్తావించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. ఎంపీలు రఘురాంరెడ్డి, కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రాణం తీసిన చుట్ట..
● చుట్ట కోసం ఐరన్‌రాడ్ రంధ్రంలో చెయ్యి పెట్టిన వృద్ధురాలు..
● విద్యుత్‌షాక్‌కు గురై మృతి
కురవి: ఆ వృద్ధురాలికి రోజూ ఉదయం చుట్ట తాగే అలవాటు.. కొంత తాగిన అనంతరం మిగతా భాగాన్ని రేకుల షెడ్డుకు ఉన్న ఐరన్ రాడ్ రంధ్రంలో పెట్టే అలవాటు.. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం నిద్రలేచిన ఆ వృద్ధురాలు.. చుట్ట కోసం ఐరన్ రాడ్ రంధ్రంలో చేయి పెట్టింది. ఈ క్రమంలో ఐరన్‌రాడ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతి చెందింది. ఈ ఘటన కురవి మండలం రాజోలు శివారు స్టేషన్‌గుండ్రాతిమడుగులో చోటు చేసుకుంది. ఏఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన జర్పుల చిలికి(62) అలియాస్ చి లుకమ్మ ఇంటి ఎదుట రేకుల షెడ్డుకు ఐరన్ రాడ్ అ మర్చి ఉంటుంది. ఆ ఐరన్ రాడ్‌కు ఫ్యాన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిలికి చుట్ట తాగిన అనంత రం మిగతా భాగాన్ని ఐరన్ రాడ్ రంధ్రంలో పెడుతుంది. బుధవారం ఉదయం నిద్ర నుంచి లేచిన చి లికి.. చుట్ట కోసం ఐరన్ రాడ్ రంధ్రంలో చెయ్యి పె ట్టింది. అయితే ఫ్యాన్‌కు అమర్చిన విద్యుత్ తీగ తెగి ఐరన్‌రాడ్‌కు ఆనుకుని ఉండడంతో చిలికి చెయ్యి పె ట్టగానే షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు అగ్గి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకన్న తెలిపారు.
● రైల్వే జీఎంను కోరిన వరంగల్
ఎంపీ కడియం కావ్య
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి


