స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో..?

Apr 8 2025 7:43 AM | Updated on Apr 8 2025 7:43 AM

స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో..?

స్వరూపకు న్యాయం జరిగేదెప్పుడో..?

సాక్షి, వరంగల్‌: అడవుల్లో తుపాకీ పట్టి ఆ తరువాత జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు.. తనకు లొంగుబాటు సమయంలో ప్రకటించిన పునరావాస ఫలాల కోసం అధికారుల చుట్టూ 13 ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత సిద్దిపేట జిల్లా చేర్యాల (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సమయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా) మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన పాశం స్వరూప అడవిలో దాదాపు తొమ్మిదేళ్లు కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆది లాబాద్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో చివరగా సి రొంచ కమాండర్‌గా పనిచేస్తూ 2012లో పోలీసుల కు లొంగిపోయింది. ఆ సమయంలో పునరావాసం కింద 500 గజాల ఇంటిస్థలం, ఐదెకరాల వ్యవసా య భూమి ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. రెవెన్యూ భూమి కేటాయించి నివేదిక సైతం ఇచ్చారు. కానీ అలాట్‌మెంట్‌ చేయలేదు. ఆమె కు టుంబపోషణ కోసం కొమురవెల్లి దేవస్థానం ప్రాంగణంలో కట్టెలు, పూలు అమ్ముకుంటూనే, జనజీవ న స్రవంతిలో తనకు ప్రభుత్వం పునరావాసం కింద ఇస్తానన్న భూమి కోసం ఇంకా పోరాటం సాగి స్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్‌ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌కు వచ్చి మరోసారి కలెక్టర్‌ సత్యశారదకు తన బాధను ఏకరువు పెట్టుకున్నారు. అప్పటి ఉమ్మడి వరంగల్‌ కలెక్టరేట్‌ అధికారులు 2012 జూన్‌ తొమ్మిదిన ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆమెను ‘సాక్షి’పలకరించగా తన సమస్యను చెప్పుకుంది. ‘అప్పటి చేర్యాల తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు కొమురవెల్లి గ్రామంలో సర్వే నంబర్లు 199, 223లో ప్రభుత్వ భూమి ఉందని 500 గజాల స్థలం కేటాయించారు. ఐదెకరాల వ్యవసాయ భూమి విషయంలోనూ నివేదికిచ్చారు. 2012 నుంచి 2016 వరకు అధికారుల చుట్టూ తిరిగా. మధ్యలో కాలి బుల్లెట్‌ గాయం తిరగదోడడంతో కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నా. ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయానికి వెళ్లా. అక్కడా పోలీసులను కలిశా. వారు వరంగల్‌కు వెళ్లాలని చెబితే మూడు నెలల నుంచి ఇక్కడి ఐదుసార్లు వచ్చా. మూడుమార్లు పోలీసులను కలిశా. రెండుసార్లు వరంగల్‌ కలెక్టర్‌ను కలిశా. ఇప్పటికై నా సంబంధిత పత్రాలు నాకు ఇచ్చి భూమి కేటాయించి నా కుటుంబానికి భరోసాను ఇవ్వాలి’అని స్వరూప కన్నీటి పర్యంతమయ్యారు.

13 ఏళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు

తొమ్మిదేళ్లు సీపీఐఎంఎల్‌ మావోయిస్టుగా కార్యకలాపాలు

2012లోనే లొంగుబాటు,

పునరావాసం కింద అందని సహాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement