దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి

Apr 4 2025 12:55 AM | Updated on Apr 4 2025 12:55 AM

దొడ్డ

దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌

మహబూబాబాద్‌: తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, జీవిత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీర బ్రహ్మచారి, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

ప్రశంసపత్రం

అందుకున్న కమిషనర్‌

మహబూబాబాద్‌: హైదరాబాద్‌లోని దాశరథి ఆడిటోరియం హాల్‌లో కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శ్రీదేవి అధ్యక్షతన కమిషనర్లతో రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అస్తి పన్ను వసూళ్లలో టాప్‌లో ఉన్న కమిషనర్లకు సీడీఎంఏ ప్రశంసపత్రాలు అందజేశారు. కాగా మానుకోట మున్సిపాలిటీలో 75శాతం పైగా ఆస్తి పన్ను వసూలు కాగా.. కమిషనర్‌ నోముల రవీందర్‌కు సీడీఎంఏ ప్రశంసపత్రం అందజేసి అభినందించారు.

విద్యాప్రమాణాలు పాటించాలి

డీఈఓ రవీందర్‌రెడ్డి

మహబూబాబాద్‌ అర్బన్‌: పదోన్నతులు పొందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యాప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నూతనంగా పదోన్నతులు పొందిన హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, పీడీలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. తరగతి గదిలో విద్యార్థులకు మంచి బోధన చే యాలని, న్యాయకత్వ లక్షణాలు నేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు డిజిటల్‌ విద్య అందిస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో ఏఐ పాఠాల బోధనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండాలని, పౌష్టికాహారం అందించాలన్నారు. విద్యార్థులకు చదవడం,రాయడం నేర్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ అ ప్పారావు,ఏఎంఓ చంద్రశేఖర్‌ ఆజాద్‌,ఎంఈ లు, శిక్షణ నిర్వాహకులు పాల్గొన్నారు.

భద్రకాళి అమ్మవారికి

కనకాంబరాలతో పుష్పార్చన

హన్మకొండ కల్చ రల్‌: భద్రకాళి ఆలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం కనకాంబరాలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి పూర్ణాభిషేకం, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు కనకాంబరాలకు సంప్రోక్షణ నిర్వహించి వాటితో అమ్మవారికి లక్షపుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చన కార్యక్రమానికి మండువా శేషగిరిరావు దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ ఈఓ శేషుభారతి, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.

ధర్మస్థాపన కోసమే

రామావతారం

హన్మకొండ కల్చరల్‌: ధర్మ స్థాపన కోసమే రామావతారమని వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు లక్ష పుష్పార్చన నిర్వహించారు. గురువారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌ రుద్రాభిషేకం నిర్వహించారు.

దొడ్డి కొమురయ్యను  ఆదర్శంగా తీసుకోవాలి1
1/1

దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement