బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలి
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచా రాలు, కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, జై బాపు–జై భీమ్–జె సంవిధాన్ జిల్లా ఇన్‌చార్జ్ చెరగాని దయాకర్ అన్నారు. జై బాపు–జై–భీమ్–జై సంవిధాన్ కార్యక్రమ పాదయా త్ర ప్రారంభంపై జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంవిధాన్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని పాదయాత్రతో ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ప్రధాని మోదీ, అమిత్ షా విస్మరించారన్నారు. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు. సంవిధాన్ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగుతుందని, గ్రామాల్లో పాదయాత్ర ప్రారంభానికి ముందు బాపూజీ, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించాలన్నారు. మండల అధ్యక్షులు ప్రతీ గ్రామంలో పర్యటించి, సమావేశాలు నిర్వహించి పాదయాత్ర చేసే విధంగా సంవిధాన్ కార్యాచరణ రూపొందించుకోవాలన్నా రు. అనంరతం కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, రామిరెడ్డి, నాగేశ్వర్ రావు, సతీష్, ప్రభాకర్, వెంకన్న, వీరభద్రం, రఘువీర్, రజనీకాంత్, శ్రీను పాల్గొన్నారు.


