‘స్టేషన్‌’ అభివృద్ధికి రూ.800 కోట్లు | - | Sakshi
Sakshi News home page

‘స్టేషన్‌’ అభివృద్ధికి రూ.800 కోట్లు

Mar 16 2025 12:53 AM | Updated on Mar 16 2025 12:53 AM

‘స్టేషన్‌’ అభివృద్ధికి రూ.800 కోట్లు

‘స్టేషన్‌’ అభివృద్ధికి రూ.800 కోట్లు

ఎమ్మెల్యే కడియం శ్రీహరి

సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, సీపీ, కలెక్టర్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టితో పలు అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్‌ సమీపాన ఆదివారం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభా స్థలిని ఎంపీ కడియం కావ్య, కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌బాషా, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ లకు అనుగుణంగా నియోజవకర్గ అభివృద్ధే ఽధ్యేయంగా కాంగ్రెస్‌లో చేరానని, కేవలం పది నెలల్లోనే సీఎం రేవంత్‌ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేడు శంకుస్థాపన చేసిన వెంటనే పనులను ప్రారంభించి 18 నెలల్లోనే పూర్తి చేయిస్తామన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతగా నేడు 50వేల మందితో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు

పెట్టిస్తున్న సీఎం రేవంత్‌ : ఎంపీ కావ్య

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రధానంగా వరంగల్‌ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఏడాదిలోనే రూ.800 కోట్లు మంజూరు చేశారన్నారు.

సభావేదికను పరిశీలించిన సీపీ..

సీఎం సభాస్థలి, సభావేదికను వరంగల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ పరిశీలించారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లు, బందోబస్తు, పార్కింగ్‌, ట్రాఫిక్‌ తదితర అంశాలపై డీసీపీతో మాట్లాడారు. సీఎం సభ కోసం 800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ఏసీపీలు భీమ్‌శర్మ, అంబటి నర్సయ్య, సీఐలు జి.వేణు, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు వినయ్‌కుమార్‌, శ్రావణ్‌, ఆర్‌డీఓ డీఎస్‌ వెంకన్న, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్‌.నరేందర్‌రెడ్డి, జూలుకుంట్ల శిరీశ్‌రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, బూర్ల శంకర్‌, నాగరబోయిన శ్రీరాములు, నీల గట్టయ్య, అంబటి కిషన్‌రాజ్‌, నీల శ్రీధర్‌, నీల వెంకటేశ్వర్లు, రాములు, పోశాల క్రిష్ణమూర్తి, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement