రైల్వేస్టేషన్‌కు విద్యుత్‌కాంతులు | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌కు విద్యుత్‌కాంతులు

Mar 15 2025 1:41 AM | Updated on Mar 15 2025 1:41 AM

రైల్వేస్టేషన్‌కు విద్యుత్‌కాంతులు

రైల్వేస్టేషన్‌కు విద్యుత్‌కాంతులు

మహబూబాబాద్‌ రూరల్‌: అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నారు. పనులు పూర్తికానున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్‌ ఒకటో నంబరు ప్లాట్‌ ఫాం వైపున ప్రధాన ద్వారం పరిసరాలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరించగా కొత్త శోభను సంతరించుకుంది.

18, 19 తేదీల్లో

జాతీయ సదస్సు

కేయూ క్యాంపస్‌: కేయూలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ‘75 ఇయర్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌–మైల్‌ స్టోన్స్‌ ఇష్యూస్‌ అండ్‌ చాలెంజెస్‌’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవానికి హైకోర్టు పూర్వపు జడ్జి, ప్రస్తుత మహాదాయి వాటర్‌ ట్రిబ్యూనల్‌ జడ్జి పీఎస్‌ నారాయణ, తెలంగాణ హ్యూమన్‌ రైట్స్‌ పూర్వపు చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ ఆచార్య రామచంద్రం హాజరవుతారని పేర్కొన్నారు.

ప్రశ్నించేతత్వాన్ని

అలవర్చుకోవాలి..

హన్మకొండ: వినియోగదారులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు, సీసీఐ సీనియర్‌ సెక్రటరీ డాక్టర్‌ పల్లెపాడు దామోదర్‌ అన్నారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ఎకై ్సజ్‌ కాలనీలో జిల్లా వినియోగదారుల సలహా సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నా.. ఒరిజినల్‌ బిల్లులు తీసుకోవాలన్నారు. ఉత్పత్తిదారుడు ఇచ్చే గ్యారెంటీ, వారంటీ కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. వస్తువుల్లో నాణ్యతా లోపం ఉన్నప్పుడు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలన్నారు.

నేడు, రేపు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నీకాయిట్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ చాంపియన్‌షిప్‌ ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్‌కుమార్‌, గోకారపు శ్యాంకుమార్‌ తెలిపారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు 300 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన జట్లు ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. శనివారం సాయంత్రం ప్రారంభంకానున్న పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, విశిష్ట అతిథిగా కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌, కాంగ్రె్‌స్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తదితరులు హాజరవుతారని వారు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement