● బావిలో పడి వృద్ధుడి మృతి
డోర్నకల్ : ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన ఓ వృద్ధుడు హత్యాయత్నం కేసులో ఇటీవల బెయిల్ వచ్చి.. బావిలో శవమై తేలాడు. ఎస్సై గడ్డం ఉమ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ, బీసీ కాలనీకి చెందిన కై కొండ సత్యం (69) టైలర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో మాట్లాడిన అతను ఆదివారం కాలనీ సమీపంలో బావిలో శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌కు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో సత్యంపై హత్యాయత్నం కేసు నమోదు కాగా రెండు నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై కొద్దిరోజుల క్రితం విడుదలయ్యాడు.