వ్యయ పరిశీలకుడిని కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యయ పరిశీలకుడిని కలిసిన కలెక్టర్‌

Apr 19 2024 1:35 AM | Updated on Apr 19 2024 1:35 AM

- - Sakshi

మహబూబాబాద్‌: మానుకోట పార్లమెంట్‌ పరిధిలోని అభ్యర్థుల, ఎన్నికల ప్రచార ఖర్చులను పరిశీలించేందుకు గురువారం ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఉమాకాంత ద్రుపాటి జిల్లా కేంద్రానికి వచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయనను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

మహబూబాబాద్‌: అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నాగేశ్వర్‌రావు సూచించారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రులు, గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయం ఎదుట అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. ప్రజలు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, రవీందర్‌, స్వామి, రవి, బాలు తదితరులు పాల్గొన్నారు.

జనరల్‌ బోగీలు పెంచాలి

కేసముద్రం: ప్రతి రైలులో జనరల్‌ బోగీలను పెంచాలని ఐదు సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ డిమాండ్‌ చేశారు. బోగీల పెంపు కోరుతూ పీఎంకు కోటి ఉత్తరాల ఉద్యమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారని తెలి పారు. జనరల్‌ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నా రు. ఈ మేరకు ఐదు జనరల్‌ బోగీల సాధన కోసం ప్రధానమంత్రికి దేశవ్యాప్తంగా కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలి పారు. కార్యక్రమంలో కొలిపాక వెంకన్న, మామిడాల శ్రీనివాస్‌, పోకల శ్రీనివాస్‌, ఆసి న్‌, దాసన్‌, కల్లెం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌, రావుల నర్సయ్య, గురునాథం, మల్లయ్య, సూరజ్‌ పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

కురవి: ఆయిల్‌పామ్‌ పంట సాగుతో అధిక లాభాలు వస్తాయని జిల్లా హార్టికల్చర్‌ అండ్‌ సెరికల్చర్‌ అధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లోని ఆయిల్‌పామ్‌ తోటలను పరిశీలించారు. రైతులకు మేలైన యాజమాన్య పద్ధతులను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక దిగుబడులు వస్తాయని, రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. నీటి యాజమాన్యం, బిందు సేద్యం ద్వారా ఎరువులు ఇవ్వడం, మల్చింగ్‌, అంతర పంటల సాగు, ఎలుకల నుంచి కాపాడుకోవడం, అబ్లేషన్‌ పాటించడం లాంటి సూచనలు చేశారు.కార్యక్రమంలో ఆయిల్‌పామ్‌ ఫీల్డ్‌ అధికారి నాగరాజు, బిందు సేద్యం ప్రతినిధి అగస్టీన్‌, రైతులు పాల్గొన్నారు.

చెక్‌పోస్టు తనిఖీ

నెల్లికుదురు: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం డిప్యూటీ సీఈఓ నర్మద తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బాలరాజు, ఎంపీఓ పార్థసారథి, తనిఖీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement