
ఓటు హక్కు వినియోగించుకుంటున్న వయోవృద్ధుడు, పరిశీలిస్తున్న కలెక్టర్
కురవి: జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం దివ్యాంగులు, వయోవృద్ధులకు హోం ఓటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కాగా కురవి మండల కేంద్రంలో జరిగిన హోం ఓటింగ్ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక పరిశీలించారు. వయోవృద్ధుడు నూతక్కి కృష్ణారావు, దివ్యాంగులు కొమురయ్య ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని పరిశీలించారు. కలెక్టర్ వారితో మాట్లాడారు. ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించడంతో బాధలు తీరాయని చెప్పారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం బాగుందని ఓటర్లు కలెక్టర్ శశాంకకు వివరించారు.
డోర్నకల్‌లో..
డోర్నకల్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు శుక్రవారం ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలంలో 59 మంది వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా నాలుగు రూట్లలో 58 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని.. 98 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
454మంది హోం ఓటింగ్ పూర్తి
మహబూబాబాద్: మానుకోట నిమోజకవర్గంలో 471 మందికి 454మంది దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆర్వో అలివేలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 23, 24వ తేదీల్లో నిర్వహించిన హోం ఓటింగ్‌ను 315 మంది వయోవృద్ధులు, 139మంది దివ్యాంగులు సద్వినియోగం చేసుకున్నారన్నారు. మొత్తంగా 454 మంది ఓటు వేశారని, మిగిలిన 17మందిలో ఏడుగురు మృతి చెందారని, 10 మంది ఓటింగ్ కోసం నేటి(శనివారం)వరకు గడువు పెంచామన్నారు.
పరిశీలించిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment