
వాకర్స్‌తో మాట్లాడుతున్న మంత్రి
మహబూబాబాద్: ఎన్టీఆర్ స్టేడియం మరింత అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి సత్యవతిరాథోడ్ హామీ ఇచ్చారు. స్టేడియంలో సోమవారం కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మంత్రి వాకింగ్ చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టాల్సిన పనులపై చర్చించారు. మంత్రి వాకింగ్ చేసే సమయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తారసపడ్డారు. కొంతసేపు వారు మాట్లాడుకున్నారు. స్టేడియంలో జిమ్ ఇతర ఏర్పాట్లు బాగున్నాయని మంత్రికి చెప్పారు. జిల్లా అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి వాకర్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సత్వరమే సీపీఆర్ చేస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. వాకర్స్ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్