
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న డీఈఓ రామారావు
● డీఈఓ రామారావు
తొర్రూరు: జిల్లాలోని 50పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నామని డీఈఓ రామారావు తెలిపారు. వచ్చే నెల 3నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అమ్మాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను డీఈఓ సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లోని సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో 8,661 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం అమ్మాపురం ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని డీఈఓ పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రాము, హెచ్‌ఎంలు బీవీ రావు, లక్ష్మీ నారాయణ, మురళీకృష్ణ పాల్గొన్నారు.