
నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రమేష్
హసన్‌పర్తి: నాలుగు రోజుల క్రితం ఎస్సారెస్పీ కాల్వలో గల్లంతైన గుండ్లసింగారం పలివేల్పులకు చెందిన మట్టెడ హర్షిత్ మృతదేహం నేటికీ లభ్యం కాలేదు. మృతదేహం కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మధ్యలో ఎక్కడైనా మృతదేహం చిక్కిందా.. నీటి ప్రవాహానికి పక్క కొట్టుకుని పోయిందా.. అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పక్క జిల్లాల పోలీసులకు కూడా సమాచారాన్ని అధికారులు సమచారం చేరవేశారు. ఈ ఘటనలో గల్లంతైన అన్విక్ మృతదేహం రెండు రోజుల క్రితమే లభ్యం కాగా, కుంటు సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు. కాగా, కాల్వలో గల్లంతైన అన్విక్, హర్షిత్ కుటుంబాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన జుబేదా బేగం కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు నరేడ్ల శ్రీధర్, వెంకటేశ్వర్‌రెడ్డి, గనిపాక విజయ్‌కుమార్, జాగృతి జిల్లా అధ్యక్షుడు సుమన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్‌బాబా ఉన్నారు.
నాలుగు రోజులుగా గాలింపు