
హన్మకొండ: ప్రజాస్వామ్య పరిరక్షణ కు పార్టీలకు అతీతంగా తామంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ కోసం కొట్లాడుతుంటే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాత్రం బ్లాక్ మెయిలింగ్, సెటిల్‌మెంట్లలో బిజీబిజీగా గడుపుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దుయ్యబట్టారు. శనివారం హనుమకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి.. ఓటుకు నోట్ కేసుకు భయపడి బీజేపీని విమర్శించడానికి భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌పై బురద చల్లే కుయుక్తులకు పాల్పడుతున్నాడని మంత్రి ధ్వజమెత్తారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనమని, ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం మోపుతుందనడానికి నిలువటద్దమన్నారు. లేనిపోని అపోహలతో, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్‌ని కూడా పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు