అమరావతి పేరిట హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

అమరావతి పేరిట హైడ్రామా

Mar 30 2026 8:45 AM | Updated on Mar 30 2026 8:45 AM

ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి

మంత్రాలయం రూరల్‌: అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు. రాంపురం గ్రామంలో ఆదివారం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక అమరావతి రాజధాని పేరుతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో అభివృద్ధే కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం చంద్రబాబు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డు పడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేశారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ప్లాట్లు చెరువులో ఉన్నాయన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో మూడు పంటలు పండే లక్షల ఎకరాలను రైతుల నుంచి సేకరించి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మభ్యపెడడుతున్నారన్నారు. చంద్రబాబుకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు.

శేషవాహనంపై శ్రీరంగనాఽథుడు

జూపాడుబంగ్లా: తర్తూరు వెలసిన శ్రీలక్ష్మిరంగనాథస్వామి శేషవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం పట్టువస్త్రాలతో అలంకరించిన స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో తీసుకెళ్లి శేషవాహనంతో అలంకరించిన గ్రామోత్సవ రథంపై స్వామివారిని ఉంచారు. ప్రధాన అర్చకుడు ఈశ్వరరెడ్డి స్వామివారికి సాష్టాంగనమస్కారాలు చేసుకొన్న అనంతరం భక్తులు జయజయ ధ్వానాల మధ్య గోవింద నామాన్ని స్మరిస్తూ స్వామివారి గ్రామోత్సవ రథాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి శేషవాహనోత్సవానికి ప్రత్యేక ఉంది. ప్రజలు, రైతులు పొలంగట్లవెంట తిరిగేటప్పుడు నాగశేషుని నుంచి తమకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా శేషవాహనం రోజున స్వామివారికి మల్లెపూలలను సమర్పించి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన మల్లెలతో స్వామివారి, అమ్మవారి మూలవిగ్రహాలు నిండిపోయాయి.

నేడు హనుమద్వాహనసేవ

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం స్వామి వారికి హనుమద్వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ఈశ్వరరెడ్డి, చైర్మన్‌ నారాయణరెడ్డి, ఈఓ సాయికుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement